40 years | క్యాల్షియమ్ లోపంతో…

40 years | క్యాల్షియమ్ లోపంతో…
ఎముకల దృఢత్వం తగ్గుతుంది
40 years | నర్సంపేట, ఆంధ్రప్రభ : క్యాల్షియం లోపం వల్లనే ఎముకల దృఢత్వం తగ్గుతుందని డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి(Dr. Lekkala Vidyasagar Reddy) తెలిపారు. జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ హాస్పిటల్లో(Green Star Hospital) దివ్యాంగులకు శిబిరాన్ని నిర్వహించారు. ఎముకలకు సంబంధించిన (బిఎంటి) బోన్ మారో టెస్ట్ ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ… ఎముకలు దృఢత్వం కోసం కల్తీ లేని పాలు, పండ్లు, గుడ్లు, చేపలు నువ్వులు, వంటివి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలన్నారు. 40ఏళ్లు పైబడిన(40 years) ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి కాలుష్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధు బిఎండి టెక్నీషియన్ సాయినాథ్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్స్ రవి, నాగిరెడ్డి, శ్రీను, యువరాజు పాల్గొన్నారు.
