కేజీబీవీలో ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానం..

కేజీబీవీలో ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానం..

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో చేరాలనుకుంటే ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ ముత్యాలమ్మ పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని పంగల్ రోడ్డు దగ్గర ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబందించి కెజిబివి పాఠశాల ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రకియ ప్రారంభమవుతుందని తెలిపారు.6 వ తరగతికి 40 సీట్లు ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ గ్రూపు 40 సీట్లు ఇంటర్ రెండవ సంవత్సరంలో బైపిసి గ్రూపు 8 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు అలాగే 7 నుండి 10 తరగతులకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండలంలోని అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Leave a Reply