39th anniversary | మహనీయులకు నివాళులర్పించిన ఎస్పీ

39th anniversary | మహనీయులకు నివాళులర్పించిన ఎస్పీ

39th anniversary | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఇవాళ ఆసిఫాబాద్ ఎస్పీ నికిత పంత్ సందర్శించారు. ఆమెకు మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, గ్రామస్తులు స్వాగతం పలికారు. ఎస్పీ ఆ గ్రామంలోని ప్రొఫెసర్ హేమాండార్ప్ బెట్టి ఎలిజబెత్ల దంపతుల విగ్రహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి మహిళల(women)కు, ప్రజలకు ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. సందీర్ కు రామ్ రామ్ అంటూ పలకరించారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈనెల 11న మార్లవాయిలో జరిగే మహనీయుల 39వ వర్ధంతి(39th death anniversary) వేడుకల గురించి మాట్లాడారు.

39th anniversary |

ఈ వేడుకలకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రానుండడంతో పోలీసులతో ఏర్పాట్ల విషయంపై మాట్లాడినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, జైనూర్ సిఐ రమేష్,ఎస్సై రవికుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply