364.5MillionDollars | చమురు ధరలపై ప్రభావముంటుందా?

364.5MillionDollars | చమురు ధరలపై ప్రభావముంటుందా?

364.5MillionDollars న్యూఢిల్లీ : వెనెజులాలో ప్రస్తుత సంక్షోభం వల్ల భారత్ కు ఎలాంటి భౌతిక ఆర్ధిక, ఇంధన ప్రభావాన్ని చూపే అవకాశం లేదని పరిశోధనా బృందం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఎస్ఐ) తెలిపింది.

వెనెజులా నుంచి భారత్ 2000, 2010లో ముడి చమురును ఎక్కువగా కొనుగోలు చేసిందని జీటీఆర్ఐ తెలిపింది. ఒరినోకో బెల్ట్ ఓఎన్జీసీ విదేశీ వాటాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షల మూలంగా 2019 నుంచి ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి. దీని వల్ల భారత్ చమురు దిగుమతులను తగ్గించుకుంది. అమెరికా నుంచి ద్వితీయ ఆంక్షలు నివారించేందుకు వెనిజులాతో వాణిజ్య కార్య కలాపాలను కూడా తగ్గించుకున్నట్లు తెలిపింది. ఫలితంగా ప్రస్తుతం వెనిజులాతో భారత్ వాణిజ్యం చాలా తక్కువగా ఉందని జీటీఆర్ఐ విడుదల చేసిన పేర్కొంది.

364.5MillionDollars | భారత్ కు వెనెజులా ఎంతో దూరం

364.5MillionDollars
364.5MillionDollars

వెనెజులా నుంచి భారత్ కు 364.5 మిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఇందులో ముడి చమురు దిగుమతులు 255.3 విలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023-24 భారత్ 1.4 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంది. దీంతో పోల్చితే 2024-25లో దిగుమతులు 81.3 శాతం తగ్గాయి. భారత్ నుంచి వెనిజులాకు 95.3 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.

ఇందులో 41.4 మిలియన్ డాలర్ల విలువైన ఫార్మాసూటికల్స్ ఎగుమతులు ఉన్నాయని జీటీఆర్ఎస్ఐ పేర్కొంది. రెండు దేశాల మధ్య తక్కువ వాణిజ్య పరిమాణాలు, ఇప్పటికే ఉన్న ఆంక్షల పరిమితులు, భౌగోళికంగా వెనిజులా చాలా దూరంలో ఉండటం వంటి కారణాలతో ఈ దేశ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై, ఇంధన భద్రతపై ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తున్నట్లు జీటీఆర్ పేర్కొంది.

రానున్న సంవత్సరాల్లో ముడి సరుకులు, ఇంధన వనరుల కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని, తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడు కోవాలని, సార్వభౌమత్వాన్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలను బలహీన పరిచి ఒప్పందాలను నివారించాలని, భౌగోళిక రాజకీయ ఒత్తిడి లేకుండా కీలకమైన ముడి పదార్ధాలు, ఇంధన యాక్సెస్ పొందాలని టీఆర్ఎస్ఐ సూచించింది.

364.5MillionDollars | వెనిజులాలోనే ముడి చమురు నిల్వలు ఎక్కువ

వెనిజులా ముడి చమురుపై నియంత్రణ కోసమే అమెరికా దాడి చేసిందిన జీటీఆర్ ఐ పే ర్కొంది. వెనెజులా ప్రపంచంలోని చమురు నిల్వల్లో 18 శాతం వాటా కలిగి ఉంది. ఇది సౌదీ అరేబియాలో ఉన్న 16 శాతం, రష్యాలో 6 శాతం, అమెరికాలో 4 శాతం కంటే చాలా ఎక్కువ. అమెరికా, రష్యా రెండు దేశాలు కలిపినా వెనిజులాలోనే ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అమెరికా వద్ద తగినంత నిల్వలు, రిఫైనరీ సామర్ధ్యం లేనప్పటికీ యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్తో పెట్రోలియం ఉత్పత్తులు, ఎలీ ఎగుమతులు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది.

ఈ నేపధ్యంలోనే ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేసిందని, తామే అక్కడ పాలన సాగిస్తామని ప్రకటించిందని జీటీఆర్ ఐ పేర్కొం ది. కేవలం వెనిజులా చమురు కోసమే డ్రగ్స్ రవాణా ఇతర కారణాలు చూపి దాడి చేసిందని స్పష్టం చేసింది.

364.5MillionDollars | వెనెజులాలోనే భారీ చమురు నిల్వలు

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా వెనెజులాలో చమురు నిల్వలు ఉన్నాయి. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం వెనెజులాలో 303 బిలియన్ బెరళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రపంచ నిల్వల్లో ఐదవ వంతు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బెరల్ చమురు ధర 57 డాలర్ల వద్ద ఉంది. దీని ప్రకారం వెనెజులాలో ఉన్న చమురు నిల్వల విలువ 17.3 లక్షల కోట్ల డాలర్లు. అమెరికా, చైనా దేశాలు మినహా ప్రపంచంలో ఏ దేశ జీడీపీ కంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువ.

వెనెజులాపై ఆదిపత్యం కోసం అమెరికా చాలా కా లంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్లు అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని అన్ని విధాలుగా సహకరించినప్పటికీ ప్రజలు మాత్రం మదురోను ఎన్నుకున్నారు. తన చేతిలో కీలు బొమ్మ ను అధ్యక్షుడిగా చేసి చమురుపై నియంత్రణ సాధించాలని అమెరికా వేసుకున్న ప్లాన్స్ విఫలం అయ్యాయి. దీంతో ట్రంప్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సాకుతో దాడి చేశారని దౌత్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం సాకు మాత్రమేనని, అత్యంత విలువైన చమురు, ఖనిజాల కోసమే దేశాధ్యక్షుడిని నిర్బంధించారని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ALSO READ : Trump – Zelenskyy | ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ

click here to read more

వెనెజులాపై ఆదిపత్యం కోసం అమెరికా చాలా కా లంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్లు అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని అన్ని విధాలుగా సహకరించినప్పటికీ ప్రజలు మాత్రం మదురోను ఎన్నుకున్నారు. తన చేతిలో కీలు బొమ్మ ను అధ్యక్షుడిగా చేసి చమురుపై నియంత్రణ సాధించాలని అమెరికా వేసుకున్న ప్లాన్స్ విఫలం అయ్యాయి. దీంతో ట్రంప్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సాకుతో దాడి చేశారని దౌత్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం సాకు మాత్రమేనని, అత్యంత విలువైన చమురు, ఖనిజాల కోసమే దేశాధ్యక్షుడిని నిర్బంధించారని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.వెనెజులాపై ఆదిపత్యం కోసం అమెరికా చాలా కా లంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే పలు మార్లు అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని అన్ని విధాలుగా సహకరించినప్పటికీ ప్రజలు మాత్రం మదురోను ఎన్నుకున్నారు. తన చేతిలో కీలు బొమ్మ ను అధ్యక్షుడిగా చేసి చమురుపై నియంత్రణ సాధించాలని అమెరికా వేసుకున్న ప్లాన్స్ విఫలం అయ్యాయి. దీంతో ట్రంప్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సాకుతో దాడి చేశారని దౌత్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం సాకు మాత్రమేనని, అత్యంత విలువైన చమురు, ఖనిజాల కోసమే దేశాధ్యక్షుడిని నిర్బంధించారని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply