34 years | ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు

34 years | ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు

  • వెయ్యికి పైగా పాల్గొన్న వైద్యులు…

34 years | కర్నూలు, ఆంధ్రప్రభ : ఆర్థోపెడిక్ శాస్త్ర రంగంలో తాజా వైద్య పరిజ్ఞానం, ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OSSI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 55వ OSSAPOCON–2026 రాష్ట్రస్థాయి మూడు రోజుల ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కర్నూలు మెడికల్ కాలేజ్‌లో ఘనంగా ప్రారంభమైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, కర్నూలు మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థోపెడిక్ వైద్యం కేవలం ఎముకల చికిత్సకే పరిమితం కాకుండా రోగి జీవన నాణ్యతను మెరుగుపరిచే కీలక వైద్య విభాగమని పేర్కొన్నారు. 1992లో కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యుడు శేషన్న ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 34 సంవత్సరాల తర్వాత మళ్లీ కర్నూలులో ఈ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించబడటం గర్వకారణమని తెలిపారు.

34 years |

దేశ విదేశాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా వైద్యులు హాజరవడం సదస్సు ప్రాధాన్యతను చాటుతోందన్నారు. ఈ సదస్సులో క్లిష్టమైన, అధునాతన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సా విధానాలపై ప్రదర్శనలు, పేపర్ ప్రజెంటేషన్లు నిర్వహించబడతాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, ట్రామా కేర్, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి రంగాల్లో నిరంతర నవీకరణలు అవసరమని సూచించారు. రాష్ట్రస్థాయి కాన్ఫరెన్సులు యువ వైద్యులు, సీనియర్ సర్జన్ల మధ్య జ్ఞాన మార్పిడికి వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్, పేషెంట్ సేఫ్టీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

34 years |

ప్రభుత్వ వైద్య కళాశాలలు శిక్షణతో పాటు సేవాభావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వహిస్తున్నాయని అన్నారు. సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు పాల్గొని ట్రామా మేనేజ్‌మెంట్, స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, స్పోర్ట్స్ ఇంజరీలు, పిల్లల ఆర్థోపెడిక్స్ తదితర అంశాలపై చర్చలు, డిబేట్లు, పేపర్ ప్రజెంటేషన్లు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఏడీఎంఈ, ప్రిన్సిపాల్ డా. చిట్టి నరసమ్మ, ఏడీఎంఈ, సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ఓసాప్కాన్ ప్రెసిడెంట్ డా. అశోక్ కుమార్, సెక్రటరీ డా. విజయ కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డా. శ్రీనివాసులు, సెక్రటరీలు ఇలియాస్ భాష, కో-చైర్మన్ డా. రమణ, సైంటిఫిక్ కమిటీ సభ్యులు డా. రాజయ్య, డా. అచ్యుత రావు, జాయింట్ సెక్రటరీ డా. రాజేష్, ఏపీఎంసీ అబ్జర్వర్ డా. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply