ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
- 31వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ధర్మాజీ శ్రీనివాస్
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నిక ల్లో ఒక్కసారి 31వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మోజి శ్రీనివాస్ గురువారం ఇంటింటా ప్రచారం చేపట్టి అవకాశం ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు . ఈ సందర్భంగా ధర్మాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు మరో సారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నా రు. 31వ వార్డు లో నెలకొన్న సమస్యలన్నింటిని మూడు నెల ల్లోనే తెలుసుకుని దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వార్డుకు ప్రత్యేకంగా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డు అభివృద్ధికి దోహదపడుతామన్నారు. వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
