31 buses | ఉచిత ప్రయాణంతో రద్దీ

31 buses | ఉచిత ప్రయాణంతో రద్దీ

31 buses | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణపక్షంలో వచ్చే మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహా శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా భావించబడుతుండటంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మచిలీపట్నం నుండి పెద్దకల్లేపల్లి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలకు వెళ్లేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.

మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ రాత్రి నుంచే ప్రయాణం ప్రారంభించారు. మచిలీపట్నం నుండి మొత్తం 31 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపగా, ప్రతి బస్సు భక్తులతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయాల వద్ద కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

Leave a Reply