ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం (Central Government in Parliament) మూడు కీలక బిల్లులను (three key bills) ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (three key bills in Parliament) బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు (Kashmir Bill in Parliament), రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజా ప్రతినిధి పదవి రద్దయ్యేలా బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు (bills in the Parliament) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉందని.. దేశ సమాఖ్య విధానానికి విరుద్ధం అని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. గుజరాత్ హోంమంత్రి (Gujarat Home Minister)గా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కేసీ.వేణుగోపాల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ప్రతిపక్ష ఎంపీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాసేపటికే సభ వాయిదా…
అలాగే ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే కీలక బిల్లును కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళన నడుమ ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాసేపటికే సభ వాయిదా పడింది. ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. మరోవైపు ఈ బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అమిత్‌షాకు లేఖ రాసింది