299 locations | 17 ఏళ్ల తర్వాత… స్వదేశానికి

299 locations | 17 ఏళ్ల తర్వాత… స్వదేశానికి
299 locations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్ధీన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఇటీవల అక్కడ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. మరోవైపు ఇప్పటిదాకా ప్రభుత్వ సారథిగా వ్యవహారించిన మహమ్మద్ యూనస్ సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా చివరిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం చేశారు.
