287th Birthday | శ్రీ సంత సేవాలల్ జయంతిని విజయవంతం…

287th Birthday | శ్రీ సంత సేవాలల్ జయంతిని విజయవంతం…

287th Birthday | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో అధికారికంగా ఈ నెల 18న నిర్వహించే బంజారాల గురువు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287 వ జయంతి విజయవంతం చేయాలని ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ కోరారు. శనివారం ఉట్నూరులోని మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ నివాసంలో ఆయనకు సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి అధ్యక్షులు రాథోడ్ భీంరావు నాయక్, బంజారా నాయకులు బంజారాఉద్యోగ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల కరపత్రాలను మాజీ జెడ్పీ చైర్మన్ సమక్షంలో నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాథోడ్ భీమ్రావు నాయకులు మాట్లాడుతు లంబాడా జేఏసీ నాయకులు, ఉట్నూర్ మండల బంజారా జాతి పెద్దలు మేధావులు ఉద్యోగ సంఘాల నాయకులు, యువకులు, బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో లంబాడ జేఏసీ నాయకులు, రామ్ కిషన్ నాయక్, భానోత్ జగన్ నాయక్ నేతవత్ రాందాస్, బానోత్ రామారావు, మధుకర్ జాదవ్, గణేష్ రాథోడ్, శ్రీనివాస్ జాదవ్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply