అభివృద్ధే నా గెలుపు ఆయుధం..

అభివృద్ధే నా గెలుపు ఆయుధం..

  • 27 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మురళీమోహన్

షాద్‌నగర్, ఆంధ్రప్రభ : షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో 27వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రస్తానని కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు అభ్యర్థి మురళీమోహన్ అప్పి అన్నారు. గతంలో 27వ వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపుకు బలమని, ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని (అప్పి) ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో వార్డులో పలు అభివృద్ధి పనులు చేపట్టి తన పనితీరును ప్రజలకు నిరూపించానని తెలిపారు.

మరో అవకాశం ఇస్తే వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దిశగా తనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని, నిరంతరం సేవలందించడమే తన లక్ష్యమని మురళీమోహన్ (అప్పి) తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ఆయనకు మద్దతు తెలిపారు.

Leave a Reply