27 March|అసలు నిజం ఏంటి..?

27 March|అసలు నిజం ఏంటి..?


27 March |గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ (Pan India Movie) పెద్ది. ఈ భారీ చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 27 మార్చి 2026 న పెద్ది చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని టీం ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పెద్ది అనౌన్స్ చేసిన డేట్ కి రావడం లేదని.. వాయిదా పడనుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం? ఎప్పుడొస్తుంది? ఎందుకు వాయిదా పడింది? అసలు నిజం ఏంటి..? ఎంత వరకు షూటింగ్ అయ్యింది..? పెద్ది వస్తుందా..? వాయిదా పడనుందా..? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

27 March | క్రికెటర్ గా చరణ్‌

27 March


రామ్ చరణ్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఎప్పటి నుంచో ఈ కాంబోలో సినిమా వస్తే.. చూడాలని మెగా అభిమానులే కాకుండా సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కాంబో మూవీని అనౌన్స్ చేసిన వెంటనే పెద్ది పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్‌ క్రికెటర్ గా ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. అభిమానులను మైమరపించబోతున్నాడు. తెరమీద ఉత్తరాంధ్ర స్లాంగ్ పండించడం కోసం చాలా హామ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేసాడట చరణ్‌. ఈ క్రేజీ మూవీకి మరో ప్రత్యేకత సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నారు.

27 March | ఇప్పటికే యూట్యూబ్ ని షేక్ చేసిన పెద్ది

27 March


పెద్ది సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే, ఆ స్టెప్పులకు, అదిరిపోయే మ్యూజిక్ కి, యాక్షన్ యూట్యూబ్ షేక్ అయ్యింది. ఇలా రిలీజ్ (Release) చేసారో లేదో.. అలా వైరల్ అయ్యింది. యూట్యూబ్ షేక్ అయ్యింది. ముఖ్యంగా గ్లింప్స్ లో చరణ్‌ బ్యాట్ ను డిఫరెంట్ గా పట్టుకోవడం.. ముందుకు వచ్చి మరీ.. సిక్స్ కొట్టిన స్టైల్ విపరీతంగా అభిమానులకు ఫుల్లుగా నచ్చేసింది. వీక్షకులు పదే పదే చూసేలా చేసింది. ఆ ఒక్క షాట్ గ్లింప్స్ ను బ్లాక్ బస్టర్ చేసిందని చెప్పవచ్చు.

27 March | ఇక చికిరీ వంతు

ఆ గ్లింప్స్ ఊపు నుండి అభిమానులు తేరుకోకముందే ఇటీవల ఈ మూవీ (Movie) నుంచి చికిరీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో కూడా డిఫరెంట్ గా ఉన్న చరణ్ స్టెప్ జనాలకు చూసిన వెంటనే నచ్చేసింది. అందుకే ఈ సాంగ్ కూడా యూబ్యూబ్ ఊపేసింది. మళ్ళీ మళ్ళీ జనం చూస్తూనే ఉన్నారు.

27 March

27 March | పెద్ది యమా స్పీడు..


పెద్ది సినిమాను పక్కా ప్లాన్ తో షూటింగ్ (Shooting) చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అయితే.. ఆమధ్య అనుకున్న విధంగా షూటింగ్ జరగక పోవపడం, షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని టాక్ వినిపించింది. బుచ్చిబాబు సానా అయితే.. షూటింగ్ చేయడం కోసం తిండి కూడా మానేసి వర్క్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకుని చరణ్‌.. అంతలా తిండిమానేసి మరీ.. వర్క్ చేయాల్సిన అవసరం లేదని.. హెల్త్ పై కాన్ సన్ ట్రేషన్ చేయమని చెప్పడం జరిగిందని తెలిసింది. ఇప్పుడు బ్రేకులు లేని బండిలా యమా స్పీడుగా షూటింగ్ జరుగుతుందని సమాచారం.

27 March | పెద్ది అప్ డేట్ ఏంటంటే..


పెద్ది ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ అయ్యిందని.. జనవరి ఎండింగ్ కి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తారని తెలిసింది. అయితే.. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ బ్యాలెన్స్ ఉండడంతో పెద్ది మార్చి 27న రావడం మాత్రం అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. జనవరి ఎండింగ్ కి టాకీ పార్ట్ కంప్లీట్ అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (Post-production work) కి రెండు నెలల టైమ్ ఉంటుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 27న పెద్ది రావడం ఖాయమనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

పెద్ది సినిమాను పక్కా ప్లాన్ తో షూటింగ్ (Shooting) చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అయితే.. ఆమధ్య అనుకున్న విధంగా షూటింగ్ జరగక పోవపడం, షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని టాక్ వినిపించింది. బుచ్చిబాబు సానా అయితే.. షూటింగ్ చేయడం కోసం తిండి కూడా మానేసి వర్క్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకుని చరణ్‌.. అంతలా తిండిమానేసి మరీ.. వర్క్ చేయాల్సిన అవసరం లేదని.. హెల్త్ పై కాన్ సన్ ట్రేషన్ చేయమని చెప్పడం జరిగిందని తెలిసింది. ఇప్పుడు బ్రేకులు లేని బండిలా యమా స్పీడుగా షూటింగ్ జరుగుతుందని సమాచారం.

చరణ్-శంకర్ కాంబోలో వచ్చిన డైరెక్ట్ తెలుగు మూవీ గేమ్ ఛేంజర్ (Game changer) డిజాస్టర్ అవ్వడంతో.. పెద్ది పై చరణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బుచ్చిబాబుకు ఇది రెండవ మూవీ…కావాలని తను టైం తీసుకుని చేస్తున్నా, లేక అనివార్య కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతున్నా బుచ్చిబాబులో కూడా టెన్షన్ మాత్రం ఉంటుంది. మరి.. చరణ్‌ ఆశించిన బ్లాక్ బస్టర్ బుచ్చిబాబు అందిస్తాడేమో వేచి చూడాలంటే కొత్తసంవత్సరం వచ్చేదాకా…సారీ కొత్తసంవత్సరం వచ్చాక కూడా మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే….అందాకా పెద్ది గ్లింప్స్ లోని చరణ్ బ్యాట్ విన్యాసాన్ని, చికిరి పాటలోని స్టెప్పులనూ చూస్తూ ఎంజాయ్ చెయ్యాలి. ఏమంటారు.

Click Here To Read More

Click Here To Read  వెంకీ కోసం మూడు టైటిల్స్…?

Leave a Reply