కవ్వాల అడవుల్లో ..

  • 26 మంది అరెస్ట్
  • ఆదిలాబాద్ జైలుకు తరలింపు


( జన్నారం, ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్(Kavwala Tiger Reserve) లోని కవ్వాల అడవుల్లో అక్రమంగా టేకు చెట్ల(Teak trees)ను నరికిన 26 మంది నిందితులను అరెస్ట్ చేసి లక్షేటిపేట కోర్టు(Laksetipet Court)లో హాజరు పరిచినట్లు మంచిర్యాల జిల్లా(Manchryala District) జన్నారం ఎఫ్డీఓ రామ్మోహన్(Rammohan) ఆదివారం తెలిపారు.తరువాత ఆ నిందితులను జడ్జి 14 రోజులు రిమాండ్ విధించగా,తమ ఫారెస్ట్ అధికారులు ఆదిలాబాద్(Adilabad) జైలుకు తరలించినట్లు ఆయన చెప్పారు. కవ్వాల టైగర్ రిజర్వు కోర్ ఏరియాలోని జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి రేంజ్ కవ్వాల సెక్షన్ లోతోర్రె ఫారెస్ట్ బీట్ లోని కంపార్ట్మెంట్ నెంబరు 280లో అక్రమంగా గుడిసెలు వేసుకొని చెట్లు నరికి వేసిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు), జైనూరు,లింగాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన పర్చాక మారు, కనక బాబురావు, తొడసం హన్మంతరావు,ఆత్రం రాజు,వెడ్మ జైవంత్ రావుతో పాటు 26 మంది ఆదివాసీలను మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశిష్ సింగ్(DFO Shiv Ashish Singh) ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసి లక్షెటిపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు ఆయన వివరించారు.

ఈ మేరకు ఆ జడ్జి ఆ 26 మంది నిందితులను వచ్చే నెల 14 వరకు రిమాండ్ విధించగా, తమ ఇందనపల్లి, జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు జి.శ్రీధరచారి(G. Sridharachari), వి.సుష్మారావు(V. Sushma Rao),ఇతర అటవీ అధికారులు ఆ నిందితులందరినీ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు.ప్రస్తుతం వారంతా జైల్లో ఉన్నారని ఆయన చెప్పారు.

Leave a Reply