25thFlim | మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..?

25thFlim | మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..?
25thFlim | వృషకర్మ తర్వాత చైతూ 25వ సినిమా ఇదేనా?
శివ నిర్వాణ, కిషోర్ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయి?
హరీష్ శంకర్‌తో మాస్ మూవీ వార్తల్లో నిజమెంత?
బెదురులంక డైరెక్టర్‌తో లవ్ స్టోరీ ఫిక్స్ అయ్యిందా?
ప్రేమకథలే చైతూకి కలిసొస్తున్నాయా?
25thFlim | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ చైతన్యకు 24వ సినిమా. ఈ సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ మూవీ తర్వాత కెరీర్ లో మైలుస్టోన్ లా నిలిచే 25వ సినిమా చేయనున్నారు. ఈ మూవీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొంత మంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి. ఇప్పుడు 25వ సినిమా కోసం మళ్లీ అదే రూటులో వెళుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. చైతూ 25వ సినిమా ఎవరితో..?

చైతూ కెరీర్ లో మైలురాయిలా నిలిచే 25వ సినిమా కోసం కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా మజిలీ మూవీని అందించిన శివ నిర్వాణ పేరు వినిపించింది. ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేసింది. అయితే.. శివ నిర్వాణ స్టోరీ లైన్ చెప్పినప్పుడు బాగానే ఉందని.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట చైతూ. ఇక ఈ సక్సెస్ ఫుల్ కాంబో ఫిక్స్ అని.. త్వరలో సెట్స్ పైకి వస్తుందని అనుకుంటే.. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఆతర్వాత కొత్త దర్శకుడు కిషోర్ పేరు వినిపించింది. థ్రిల్లర్ స్టోరీ రెడీ చేశాడని.. బాహుబలి ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ దర్శకుడితో కూడా స్టోరీ లైన్ బాగుందని చెప్పిన చైతూ.. నెక్ట్స్ నో చెప్పాడట. రీసెంట్ గా.. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చైతన్యతో సినిమా చేయబోతున్నాడని.. ఇది మాస్ మూవీ అని.. చైతూ 25వ సినిమా ఇదే అవ్వచ్చు అంటూ వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కించారు. ఈ బ్యానర్ లో చైతన్య ఒక సినిమా చేయాల్సివుంది. అందుచేత ఈ కాంబో సెట్ అవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. చైతన్య కోసం బెదురులంక డైరెక్టర్ క్లాక్స్ డిఫరెంట్ లవ్ స్టోరీ రెడీ చేశాడట. ఈ కథ విని చైతన్య ఇంప్రెస్ అయ్యారని.. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించనున్నారని.. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఏమామ చేసావే, ఒక లైలా కోసం, మజిలీ, లవ్ స్టోరీ.. ఇలా ప్రేమకథా చిత్రాలు చైతన్యకు బాగా కలిసొచ్చాయి. ఈమధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రం తండేల్ కూడా మంచి పేరు తీసుకువచ్చింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకనే 25వ సినిమా కోసం కూడా ప్రేమకథనే ఎంచుకున్నాడని టాక్. మరి.. త్వరలో చైతూ అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.
