500మంది మృతి
ఆంధ్రప్రభ వెబ్ డస్క్: ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతుంది. మొదట 250 మంది మరణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఐదు వందలకు చేరుకుంది. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్(Southern Afghanistan)ను సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం(A huge earthquake) వణికించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.
భూకంపం ప్రభావంతో 250 మంది నుంచి 500కు మృతుల సంఖ్య పెరిగింది. కాగా మరో 500 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్(Pakistan)తో పాటు ఉత్తర భారతదేశం(In North India)లోనూ ఈ భూకంపం ప్రకంపనలు కలకలం రేపింది.
ఇండియా(India)లోని ప్రధాన నగరం ఢిల్లీ(Delhi), ఎన్‌సీఆర్(NCR,) ప్రాంతాల్లో నేల కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురఐ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హిమాలయాల్లో పెరుగుతున్న భూకంపాలు..
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తోపాటు పొరుగున ఉన్న హిమాలయన్ బెల్టు(Himalayan belt)లో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఇండియా, యురాసియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకుంటున్న కారణంగా తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. హిమాలయన్ వ్యాలీ(Himalayan Valley)లలో ఎక్కువ మంది ప్రజలు నివసించటం, సరైన ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించటం, భూకంపాల విషయంలో సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రమాదాల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు(Scientists) అంటున్నారు.