25dead | బస్సు నదిలో పడి 25మంది మృతి

25dead | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం భారీ విషాదానికి దారి తీసింది. రాజ్‌బారి జిల్లాలోని గోలందా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.

ఈద్ సెలవులు ముగించుకుని ఢాకాకు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ప్రయాణికులు నీటిలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో కొందరు ఈత కొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.

వారిలో ఒకరు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 11 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొందరు గల్లంతయ్యే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply