అందుబాటులో ఉండి సేవలందిస్తా

అందుబాటులో ఉండి సేవలందిస్తా
- విజ్జన్న సహకారంతో అభివృద్ధి చేస్తాం
- 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొట్టే స్వరూప
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేస్తున్న తనకు అవకాశం ఇస్తే అందుబాటులో ఉండి సేవలందిస్తానని 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొట్టే స్వరూప సదానందం ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇవాళ వార్డు పరిధిలోని గడపగడపకు వెళ్లి 11వ తేదీన జరిగే ఎన్నికలో చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పట్టణాభివృద్ధికి ప్రభుత్వ నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారని, ఎమ్మెల్యే సహకారంతో 24వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాల వల్ల వార్డు అభివృద్ధికి ఒక్క పైసా కూడా రాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
