24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…

24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…
24K Gold| బంగారం ధరలకు రెక్కలు
స్థిరంగా సిల్వర్ రేటు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,570
కిలో వెండి ధర రూ.2.95 లక్షలు
24K Gold| ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇక కొన్ని నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. గల్లీల్లో ఎక్కడ చూసినా పెళ్లి సందడి నెలకొంది. మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. పెళ్లికి బంగారం కొనడం తప్పనిసరి. అయితే పసిడి ధరలు చూస్తే ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. నిన్న ఒక ధర.. ఈ రోజు ఒక ధర అన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు బంగారం ధర ఆకాశానికి నిచ్చెన వస్తోంది. దీంతో శుభకార్యాలు చేయాలనుకునే వారు బంగారం కొనాటంటే వెనుకడుగు వేస్తున్నారు. పది తులాలు కొనే దగ్గర అంత కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ధర ఇలా పెరిగితే ఏం కొంటామని నిట్టూర్చుతున్నారు.

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో… ఏ రోజు తగ్గుతాయో తెలియడం లేదు. ఇవాళ శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 500 పెరిగింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.1,48,100 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలు పెరిగాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,62,550గా ఉండగా, ఢిల్లీలో రూ.1,61,720గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో హైదరాబాద్‌తో సమానంగా రూ.1,61,570 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే, చెన్నైలో కిలో ధర రూ.2.95 లక్షలు పలుకుతుండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో రూ.2.85 లక్షలుగా ఉంది.

