24 karat gold |పసిడి పతనం

24 karat gold |పసిడి పతనం
రెండు రోజులుగా రేట్లు తగ్గుముఖం
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : దేశంలో బంగారం ధరలు మళ్లీ పడిపోతున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్ పతనమైంది. దీంతో వివాహ శుభకార్యాలు చేసేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని జ్యుయెలరీలకు పరుగెడుతున్నారు. వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారట్ బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,62,220 నుంచి రూ.1,61,240కి చేరింది. గత రెండు రోజుల్లో సుమారు రూ.2 వేలు పతనం అయింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1,48,700 నుంచి రూ.1,47,800కి వచ్చింది. 18 క్యారట్ గోల్డ్ ధర రూ.740 తగ్గి రూ.1,21,670 నుంచి రూ.1,20,930కి చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఇటీవల మళ్లీ రూ.3,00,000కి చేరిన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,90,000కి లభిస్తోంది. తులం సిల్వర్ ధర రూ.2,900గా ఉంది.
నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై.. 24 క్యారెట్లు- రూ. 16,256, 22 క్యారెట్లు – రూ. 14,900, 18 క్యారెట్లు – రూ. 12,550
ముంబై.. 24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
బెంగళూరు.. 24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
హైదరాబాద్.. 24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
విజయవాడ.. 24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
విశాఖపట్నం.. 24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093
