24 hours | పంచాయతీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తా…
- ఆశీర్వదిస్తే ప్రజలందరికీ సేవ చేస్తా
- – మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి నరెందర్ రెడ్డి
24 hours | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధి మంథన్ గోడ్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారంలోని హోరాహోరీగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. మంథన్ గోడ్ గ్రామ వ్యక్తిగా గ్రామంలో సమస్యలపట్ల పూర్తిఅవగాహన కలిగిన వ్యక్తిగా మరింతగా ప్రచారం విస్తృతం చేశారు. గ్రామంలో రోజువారీగా ఉదయం, సాయంత్రం వినూత్న ప్రచారంతో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.
గ్రామ అభివృద్ధి(Village development)కి అహర్నిశలుగా కృషి చేస్తానని, ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని, మీ అమూల్యమైన ఓటువేసి సర్పంచ్ గా గెలిపిస్తే 24 గంటలు(24 hours) ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవచేస్తామని ఓటెయ్యాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రాములు, ప్రతాపరెడ్డి, దర్శన్ గౌడ్, ఆశన్న, పాండు, మల్లికార్జున్, బ్రహ్మయ్య, చంద్రయ్య, రాములు గౌడ్, రమేష్, శాంతప్ప తదితరులు పాల్గొన్నారు.

