2026ugadi | పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు – శుభ, అశుభ ఫలితాలు & శని పరిహారాలు

2026ugadi | రాశిఫలాలు: శని ప్రభావం, జాగ్రత్తలు & శుభఫలితాలు పూర్తి వివరాలు
2026ugadi | మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల పూర్తి ఫలితాలు
ఏ రాశికి శుభం? ఏ రాశికి జాగ్రత్త అవసరం?
శని ప్రభావం ఉన్న రాశులు & పరిహారాలు
ఉగాది పంచాంగ శ్రవణ యొక్క ప్రాముఖ్యత
2026ugadi | ఓం శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలు – పంచాంగ శ్రవణ వ్యాసం
భారతీయ కాలమానంలో ఉగాది పండుగకు, పంచాంగ శ్రవణానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నూతన సంవత్సరంలో నవగ్రహాల సంచారం, ముఖ్యంగా కర్మకారుకడైన శని, జీవకారకుడైన గురువు, మరియు ఛాయా గ్రహాలైన రాహు-కేతువుల గోచార స్థితిగతుల ఆధారంగా ఏ రాశి వారికి కాలం ఎలా యోగించబోతోందో తెలుసుకోవడం మన సంప్రదాయం.

మేష రాశి:
ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని ప్రభావం గోచరిస్తోంది. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు, ఊహించని ఖర్చులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కక మానసిక ప్రశాంతత లోపించవచ్చు. గురు బలం కొంత రక్షించినప్పటికీ, పెట్టుబడుల పట్ల సాహసాలు తగవు.
వృషభ రాశి:
ఈ సంవత్సరం మీకు సానుకూల ఫలితాలు, ఆశాజనక పరిస్థితి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అయితే కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి:
వృత్తిలో ఉన్నత స్థితి, సమాజంలో గౌరవం, పరపతి వృద్ధి కలుగుతుంది. కానీ పనుల్లో జాప్యం, ఆగిపోవడం వల్ల అసహనం కలుగుతుంది. ఓర్పుతో ఉంటే అంతిమ విజయం మీదే.
కర్కాటక రాశి:
ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన, పుణ్యక్షేత్ర దర్శనాలు, లాభం ఉంటుంది. కానీ ఆరోగ్యంపై జాగ్రత్త, ఖర్చుల నియంత్రణ అవసరం.
సింహ రాశి:
అష్టమ శని ప్రభావం వల్ల అత్యంత అప్రమత్తత అవసరం. వృత్తిలో మానసిక ఒత్తిడి, ఘర్షణలు ఏర్పడవచ్చు. ఆర్థిక మోసాలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు అనుకూలం కాదు.
కన్యా రాశి:
శని ప్రభావం వల్ల దాంపత్య సమస్యలు, సమన్వయ లోపం ఉండొచ్చు. లెక్కల్లో పారదర్శకత లేకపోతే నష్టాలు తప్పవు. న్యాయ వివాదాల్లో జాగ్రత్త అవసరం.
తులా రాశి:
ఈ సంవత్సరం మీకు అద్భుతమైన యోగం. రోగాలు, రుణాలు నుంచి విముక్తి, పోటీ పరీక్షల్లో విజయం, ఉద్యోగంలో పదోన్నతి.
వృశ్చిక రాశి:
సంతానం విషయాల్లో ఆందోళన, నిర్ణయాల్లో స్థిరత్వం లోపం. షేర్ మార్కెట్‌కు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి:
కుటుంబంలో అశాంతి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రమాదం. స్థిరాస్తుల విషయంలో మోసపోయే ప్రమాదం.
మకర రాశి:
ఏలినాటి శని తొలగిపోవడం వల్ల అద్భుత ఫలితాలు, ఆదాయం పెరుగుతుంది, విజయం సాధిస్తారు.
కుంభ రాశి:
మీ మాట వల్లే శత్రుత్వం, కుటుంబంలో వాగ్వాదాలు. ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం.
మీన రాశి:
జన్మ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, నిరాశ. పనులు పూర్తి కాకపోవడం, నిరాధార ఆరోపణలు ఎదుర్కోవాలి.
శని దోష నివారణ పరిహారాలు:
- శివారాధన – సర్వ దోష హరము
- హనుమత్ ఉపాసన – విశేష రక్షణ
- దాన ధర్మాలు – శ్రేయస్సు పెంపు
- తైలాభిషేకం – శని ప్రసన్నత
- విష్ణు సహస్రనామం – ప్రశాంతత, శుభఫలితాలు
సర్వేజనాః సుఖినోభవంతు
జల్లవరపు సాయి ధీరజ్ శర్మ,
జ్యోతిష పండితులు & పురోహితులు
