2026 maharashtra | మళ్ళీ కలుస్తున్నారు
ముంబై: ఎన్నికల కోసం పవార్లు తిరిగి కలుస్తున్నారు. బాబాయ్ శరద్ పవార్ వర్గం, అబ్బాయ్ అజిత్ పవార్ వర్గం ఏకమవుతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కంకణం కట్టుకున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ శక్తిగా పవార్ కుటుంబం ఉంది. 1999లో శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రెండేళ్ల క్రితం జరిగిన విభేదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అయితే.. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆ విభేదం తాత్కాలికంగా పక్కనపెట్టి, రెండు వర్గాలు మళ్లీ కలుస్తున్నాయి.
2026 maharashtra | విభేదం మొదలైందిలా..
జులై, 2023లో తన బాబాయి శరద్ పవార్ను వ్యతిరేకి స్తూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేరారు. అజితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా అదేబాట పట్టారు. ఇది పవార్ కుటుంబంలో గాఢమైన చీలికకు దారితీసింది. అజిత్ వర్గాన్ని అసలు ఎన్సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం గడియారం చిహ్నాన్ని కేటాయించింది. ఎన్సీపీ (శరద్ పవార్)గా మారిన శరద్ పవార్ వర్గం, నగారా చిహ్నాన్ని తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకోవడం ద్వారా శరద్ పవార్ వర్గం మెరుగైన ప్రదర్శన చేసింది. కేవలం ఒక్క సీటుతో అజిత్ వర్గం సరిపెట్టుకుంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు సాధించడం ద్వారా తన బలాన్ని అజిత్ వర్గం చాటి చెప్పింది. అదే ఎన్నికల్లో 10 సీట్లకు శరద్ వర్గం పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత కుటుంబానికి దూరమవ్వడం తప్పు అని అజిత్ పవార్ స్వయంగా అంగీకరించారు.
ఎన్నికల కోసం తిరిగి కలయిక పింప్రి-చించాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి పోటీ చేస్తాయని డిసెంబర్ 28న అజిత్ పవార్ ప్రకటించారు. గడియారం, నగారా కలిసాయి. పరివార్ (కుటుంబం) మళ్లీ ఒక్కటైంది అని ఆయన ఎన్నికల ర్యాలీలో చెప్పారు. జనవరి 15న జరిగే ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మళ్లీ ఏకమవుతుంది. మహారాష్ట్రలో బీఎంసీ తర్వాత అత్యంత ధనవంతమైనమున్సిపల్ కార్పొరేష న్ పింప్రి-చించాడు పేరుంది. 1999 నుంచి 2017 వరకు అవిభాజ్య ఎన్సీపీ ఇక్కడ అధికారంలో ఉంది.
2017లో బీజేపీ దీన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు బీజేపీ ఆధిపత్యాన్ని ఎదుర్కొ నేందుకు రెండు వర్గాలు కలిసి ప్రయత్నిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు వివరాలు ఇంకా ప్రకటించలేదు. పూణే మున్సి పల్ ఎన్నికల్లో కూడా కలయిక పై చర్చలు జరుగుతున్నాయి కానీ అక్కడ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోం ది. పార్టీ కార్యకర్తల డిమాండ్, ప్రాంత అభివృద్ధి కోసమే ఈ కలయిక అని రెండు వర్గాల నేతలు చెబుతున్నారు.
2026 maharashtra | భవిష్యత్ పరిణామాలు
ఈ తాత్కాలిక కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి ఆరంభం కావచ్చు. ఒక “వైపు లౌకికవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విపక్షంలో శరద్ పవార్ వర్గం ఉండగా, అజిత్ వర్గం బీజేపీతో కలిసి అధికారంలో ఉంది. ఇది భావజాలపరంగా వైరుధ్యాలను తెస్తుంది. భవిష్యత్తులో శాశ్వత కలయిక లేదా మరిన్ని స్థానిక సంస్థల్లో పొత్తు జరుగుతుందా అనేది ఆసక్తికరం. పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటవడం రాష్ట్రంలోని ఇతర రాజకీయ కుటుంబాల (ఉదా: ఠాక్రేలు) కలయికలతో పోల్చదగినది. ఎన్నికల రాజకీయాల్లో కుటుంబ బంధాలు ముఖ్యమని మరోసారి నిరూపితమైంది. ఈ కలయిక బీజేపీ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందా? లేక కేవలం స్థానిక స్థాయికే పరిమితమవుతుందా? అనేది రానున్న రోజుల్లో చూడాలి.

మహారాష్ట్రలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొన్ని పార్టీలు, వర్గాల్లోని ‘శత్రువులు’ ఏకమవుతున్నారు. మహారాష్ట్ర స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన శరద్ పవార్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ తిరిగి కలిసిపోయారన్న వార్త ఆశ్చర్యం కలిగించలేదు. అలాగే, కొద్ది రోజుల క్రితం థాకరే సోదరులు ఏకం కావడాన్ని కూడా రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసున్నవారెవరికీ అసహజంగా అనిపించలేదు. వారి మధ్య సైద్ధాంతిక పరమైన వైరం లేదు. శరద్ పవార్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాక, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్లో ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సోనియా గాంధీ హయాంలో ఆయన కాంగ్రెస్ కి దూరమయ్యారు. ఆమె నాయకత్వాన్ని విదేశీ సమస్య పై వ్యతిరేకించారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా సోనియా ఏర్పాటు చేసిన ఐక్య ప్రగతి శీల కూటమి (యూ పీఏ)లో చేరారు. నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్సీపీ)ని స్థాపించిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్తో కలిసి పని చేశారు.
2026 maharashtra | రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా
అజిత్ పవార్ చాలా కాలం ఎన్సీపీ రాష్ట్ర నాయకునిగా వ్యవవహరించి, ఉప ముఖ్య మంత్రి పదవిని బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఇస్తాననగానే ఎన్సీపీలో చీలిక తెచ్చారు. పవార్ వెనకే ఉండేవారిని క్రమంగా తనవైపునకు అజిత్ తిప్పు కున్నారు. ముంబాయి మహానగరానికి, ఇతర నగరాలకు ఎన్నికలు జరగనున్నందున శరద్ పవార్తో చేతులు కలిపేందుకు అజిత్ పవార్ సిద్ద మవుతున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ కూటమిలో ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక బాలాక్రే అన్న కుమారుడు రాజ్ థాక్రే శివసేన వారసత్వం తనకు దక్కనందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు.
సుదీర్ఘకాలం తరువాత ఇటీవల థాకరేలు ఇద్దరూ మునిసిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. వీరంతా సహజంగా మిత్రులే. పదవుల కోసం సొంత కుంపట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మునిసిపల్ ఎన్నికలు వస్తున్న దృష్ట్యా చేతులు కలపడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. శరద్ పవార్ సలహా సంప్రదింపులు అందరికీ కావాలి. అందువల్ల ఆయన నేతృత్వంలో పని చేయడానికే ఒక తాటి మీదికి వచ్చారు. అయితే, ఈ పొత్తులు, కలయికలు ఎంత కాలం ఉంటాయన్నది చెప్పలేం. రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా వీరంతా ఇప్పుడు ఏకమ వుతున్నారు. బీజేపీ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు ఏకమైన వీరు ఎంతకాలం కలసి ఉంటారో చెప్పలేం.
click here to read judgment | ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

