2026 Calendar | విద్యాభివృద్ధికి కృషి చేద్దాం..

2026 Calendar | విద్యాభివృద్ధికి కృషి చేద్దాం..
- ఊట్కూర్ మండల విద్యాధికారి మాధవి
2026 Calendar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు తపస్ సంఘం నాయకులతోపాటు విద్యాశాఖ అధికారులందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారిని మాధవి, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు తమ సమస్యల పరిష్కారంతోపాటు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. నవ వసంతానికి నాంది పలుకుతూ విద్యా ప్రగతికి వారధిగా నిలవాలని ఉపాధ్యాయ లోకానికి దిక్సూచిగా నిలవాలన్నారు. 2026 క్యాలెండర్ కేవలం తేదీల పట్టిక కాదని, ఉపాధ్యాయుల హక్కుల సాధనలో విద్యా ప్రమాణాలు పెంపులో తపస్ వేస్తున్న అడుగులని, రాబోయే విజయానికి ఇది ప్రణాళిక అన్నారు. నూతన సర్పంచుల సహకారంతో విద్యాభివృద్ధిలో పురోగతి సాధిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నరసింగప్ప, మండల అధ్యక్షులు కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ తాపస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
