2002 Voter | తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
2002 Voter | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి(T. Vinay Krishna Reddy) సూచించారు. కమ్మర్ పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు.
తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటరు(2002 Voter) జాబితాతో ప్రస్తుత 2025 ఓటరు జాబితాను సరిపోల్చుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించారా అని పరిశీలించారు.
నిర్దిష్ట గడువులోపు ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ(SIR Preparation Process)ను పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఇంకనూ ఏవైనా అర్జీలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆయా మాడ్యూల్స్(Modules లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదాబైనామా అర్జీల(Sadabai Nama Applications)లో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
పీ.ఓ.టీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే, అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసిల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ, వాటిని ఏ మాడ్యుల్ లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమ్మర్ పల్లి తహసిల్దార్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.


