20 months | సంక్షేమం – అభివృద్ధిలో ముందంజ..

20 months | సంక్షేమం – అభివృద్ధిలో ముందంజ..

  • స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్న పాలన

20 months | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ రోజు స్థానిక కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసం పొందినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కోట్ల సంఖ్యలో ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించడంతో పాటు, దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగిందన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించగా, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లక్షలాది మందికి అందుతున్నాయని వివరించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం, మత్స్యకారులకు వార్షిక ఆర్థిక సాయం, నేతన్నలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు వార్షిక భృతి వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు లబ్ధి చేకూరిందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల సంఖ్యలో భోజనాలు అందించడంతో పాటు, గీత కార్మికులు, స్వర్ణకారులు, పాస్టర్లు, ఇమాములు, అర్చకులు, నాయీబ్రాహ్మణులు, జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.

మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు, రైతులకు రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసినట్లు తెలిపారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు, రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో పల్లె పండుగ ద్వారా వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమలకు రాయితీలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం, దేవాలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు, పిపిపి విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, పేద విద్యార్థులకు అదనపు వైద్య విద్యా సీట్లు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గ్రామసభల నిర్వహణ, తాగునీటి ప్రాజెక్టులు, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, విద్యుత్ చార్జీల పెంపు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పేదలకు గృహ స్థలాల కేటాయింపు, ఉచిత ఇసుక విధానం, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ రూప్‌టాప్ పథకం, బీసీలకు అదనపు ఆర్థిక సాయం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తుంగభద్ర సహా ప్రధాన ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించడంతో పాటు కాలువల నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply