2 defferent | పెట్టుబడులు, ఉద్యోగాలు
2 defferent | ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో కొత్తగా పెట్టుబడులు లక్షల కోట్లలో రాబోతున్నట్టు కొత్త కొత్త వార్తలు! ఆంధ్ర ప్రదేశ్ లో, 13 లక్షల కోట్ల విలువగల’ పెట్టుబడులూ, తెలంగాణాలో దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులూ, వస్తాయని ఆ2రాష్ట్రాల ప్రభుత్వాలూ చెపుతున్నాయి. ఆ కొత్తపెట్టుబడుల వల్ల, దాదాపు 16 లక్షల ఉద్యోగాలకు అవకాశం వుంది’ అని ఒక రాష్ట్రము, 13 లక్షల ఉద్యోగాలు వస్తాయి’ అని ఇంకో రాష్ట్రమూ, చెప్పుకుంటున్నాయి.

దాదాపు ఈ రకం మాట ల్నే, ఈ రాష్ట్రాలలో గతంలో వుండిన పాత ప్రభుత్వాలు కూడా చెప్పుకున్నాయి. అప్పుడైనా, ఇప్పుడైనా కూడా, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పుకోవడమూ, ప్రతిపక్షంలో వున్న పార్టీలు, ‘అది అంకెల గారడీ’ అనీ, ‘జరిగే పనికాదు’ అనీ, అనడమూ, మామూలే! అటూ, ఇటూగా చెప్పే పాలక వర్గ పార్టీల దృష్టితో కాక, శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాల దృష్టితో, శ్రామిక ప్రజలంగానే మనం, ఒక ప్రశ్న వేసుకోవాలి! ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఆ ఉద్యోగాలు కోట్లల్లోనా, లక్షల్లోనా, వేలల్లోనా?’ అని మన ప్రశ్న.
2 defferent | అనేక లక్షల ఉద్యో గాలు

రెండు రాష్ట్రాలలోనూ, నిరుద్యోగులు ఎంతమంది వున్నారూ అనే లెక్కల్ని రకరకాల సర్వేలు, రకరకాలుగా చూపెడుతున్నాయి. ఆ సర్వేలు, కచ్చితమైన లెక్కలనైతే ఇవ్వడం లేదు. కానీ, ‘నిరుద్యోగులు అనేక లక్షల్లో వున్నారు’ అని అయి తే అనేక సర్వేలు చెపుతున్నాయి. కొత్తగా వచ్చే పెట్టుబడుల వల్ల, అనేక లక్షల ఉద్యో గాలు వస్తాయని ప్రభుత్వాలే అంటున్నాయంటే, అన్ని లక్షల మంది లకు ఎన్ని ఉద్యోగాలు రావొచ్చో తెలుస్తుంది. పెట్టుబడి అనేది, 2 భాగాలుగా వుంటుంది.
(1) కొత్త సరుకు తయారీకి అవసరమైన మొదటి ‘సాధనాల’ మీద పెట్టే భాగం ఇది. యంత్రాలూ, ముడి పదార్ధాలూ వంటివన్నీ కలిసి, ఉత్పత్తి సాధనాలు. (2) ఆ సాధానాలు ఉపయోగిస్తూ ‘పని’ చేసే కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఈ రెండవ భాగం. ఈ 2 భాగాల మీద పెట్టే పెట్టుబడులకు, 2 వేరు వేరు మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

