నిజాయితీకి అవకాశం ఇవ్వండి

భీంగల్ ఒకటో వార్డు ఇండిపెండెంట్ గా పోటీ లో ఉన్న వాక మహేష్
భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ ) నిజాయితీ, సమస్యలు పరిష్కరించాలనే తపన, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో వస్తున్న తనను ఆదరించాలని వాక మహేష్ కోరారు. గురువారం భీంగల్ ఒకటో వార్డు లో ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీ వ్యక్తిగా తనను ఆదరించి విజయం అందించాలని కోరారు. ఇండిపెండెంట్ గా పోటీ లో ఉన్న తన గుర్తు ఫుట్బాల్ కు ఓటు వేసి విజయం అందించాలని కోరారు. వార్డు సమస్యలు తన సమస్యలు గా భావించి పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. కాలనీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. వార్డు లో విద్యుత్ సమస్య, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్స్, వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలు సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి సామాజిక సేవ చేసేందుకు వస్తున్న యువత కు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా వార్డు లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
