మీ వెన్నెంటే ఉంటాను…ఒక్క అవకాశం ఇవ్వండి.

1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం దయాకర్

1వ వార్డు అభివృద్ధే లక్ష్యం..మీ ఆశీస్సులే బలం
-గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది.
-నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తా..
-అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం దయాకర్

స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగాపురం దయాకర్ అన్నారు.
బుధవారం వార్డు పరిధిలో గడపగడప ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి 11వ తేదీన జరిగే ఓటింగ్ లో పాల్గొని చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ.. ప్రజల వెన్నంటే నిలబడి నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తా ను. గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..మరో మారు అవకాశం ఇస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపి స్తానని అన్నారు. అలాగే అధికార పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్య మని, కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. 1వ వార్డు ప్రజల ఆశీస్సులే తన బలమని, వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం దయాకర్ స్పష్టం చేశారు.

Leave a Reply