చికెన్ కొడుతూ …ఓటు అభ్యర్థిస్తూ

చికెన్ కొడుతూ …ఓటు అభ్యర్థిస్తూ

  • 1 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి నరేష్ వినూత్న ప్రచారం

మోత్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : మోత్కూర్ మున్సిపాలిటీలో 1 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చోల్లేటి నరేష్ తన సతీమణి తో కలిసి మెయిన్ రోడ్లు లో తబస్సుమ్ చికెన్ షాప్ లో చికెన్ కొడుతూ… షాప్ నిర్వాహకుడు జలీల్ ని ఓటు అభ్యర్థిస్తూ శనివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. తాను నిత్యం వార్డులో అందుబాటులో ఉంటానని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ..1 వ వార్డులో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇస్తున్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలలోనే అభివృద్ధి పనులు చేపట్టారని… ప్రస్తుతం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు జరగడంలేదని …తనకు ఒకసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే …వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కోరుతున్నారు.ఈ సందర్భంగా ఆయన వెంట బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు చోల్లేటి నరేశ్,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పురుగుల మల్లయ్య,నాయకులు అన్నందాసు మచ్చగిరి, కుటుంబ సభ్యులు చోల్లేటి బాబు చారి,సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply