1st | తమిళ మూవీ ఎవరితో తెలుసా..?

1st | తమిళ మూవీ ఎవరితో తెలుసా..?
1st | సీతారామమ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్
1st | ధనుష్ కాదు.. శింబుతో రొమాంటిక్ మూవీ
1st | అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కొత్త సినిమా
1st | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మృణాల్ ఠాగూర్.. తెలుగులో సీతారామమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంత వరకు తమిళ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని తెలిసింది. అయితే.. తమిళ్ లో సినిమా చేస్తుందంటే.. ధనుష్ తో అనుకుంటారు కానీ.. ధనుష్ కాదట. మరి.. మృణాల్ తమిళ్ మూవీ ఎవరితో చేస్తుంది.?

నార్త్ నుంచి సౌత్ కు వచ్చిన హీరోయిన్స్ కు ఒక్క భాషలో హిట్ వస్తే.. ఇక్కడున్న ఇతర భాషల్లో ఛాన్సులు వచ్చేస్తాయి. సౌత్ అంతటా స్టార్ స్టేటస్ సంపాదించేస్తారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక్క హిట్ సాధిస్తే.. కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తుంటాయి. అలాగే కోలీవుడ్ లో సక్సెస్ సాధిస్తే.. టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తుంటాయి. అయితే.. సీతారామమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మృణాల్ ఇంత వరకు సౌత్ లో వేరే భాషల్లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో మృణాల్ ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిగా మారింది.

తమిళ్ లో ఎవరితో సినిమా చేస్తుందంటే.. శింబుతో చేస్తుందని తెలిసింది. ఈమధ్య కోలీవుడ్ స్టార్ ధనుష్, మృణాల్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ ప్రచారం జరగడం.. పెళ్లి చేసుకోబోతున్నట్టుగా న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ జంట వార్తల్లోకి వచ్చారు. దీంతో తమిళ్ లో మృణాల్ సినిమా చేస్తుందంటే ధనుష్ అనుకున్నారు.

శింబు సరసన ఈ మరాఠీ భామ నటించబోతోంది. ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాలతో మంచి పేరు సంపాదించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో శిండు ఒక రొమాంటిక్ మూవీ చేయబోతున్నాడు. అందులో మృణాల్ కథానాయికగా నటించబోతోంది. శింబు, మృణాల్.. ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అందుచేత ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి.. కోలీవుడ్ లో మృణాల్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
CLICK HERE TO READ సమంత పేరు మారబోతుందా? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!
