PM Kisan | 24న 19వ విడత.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు !
- రూ.2 వేల చొప్పున నిధుల జమ
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద అందించే ‘పీఎం కిసాన్’ పథకం 19వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఈ నెల (ఫిబ్రవరి) 24న రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు తెలపింది.
19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.