195th anniversary | సావిత్రి బాయి పూలే అడుగు జాడల్లో నడవాలి.

195th anniversary | సావిత్రి బాయి పూలే అడుగు జాడల్లో నడవాలి.
195th anniversary | దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు సావిత్రి బాయి పూలే అడుగు జాడల్లో నడవాలని సర్పంచ్ సంతపురి కళావతి అన్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన సావిత్రి బాయి పూలే 195వ జయంతి(195th anniversary) వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఆమె సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… సావిత్రిబాయి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అఖిల, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప ఉపాధ్యాయులు శ్యామల, అంగన్వాడి టీచర్ లక్ష్మి, ధనలక్ష్మి, యువత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
