వాటి విలువ ఎంతంటే….
హైదరాబాద్(ఆంధ్రప్రభ): గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి విమానాల్లో మద్యం తీసుకువచ్చి తెలంగాణలో అమ్మకాలకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం పహాడీ షరీఫ్ వద్ద కార్లు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా 20 మంది దగ్గరల అత్యధికంగా మద్యం బాటిలల్స్ ఉండడంతో వారికి నోటీసులు ఇచ్చారు.
తనిఖీల్లో భాగంగా 192 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఈ ఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 5.76 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు.
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈ మద్యం బాటిల్స్ ని పట్టుకున్నందుకు డైరెక్టర్ ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందిని అభినందించారు.
ఆయనతో పాటు రంగారెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ కూడా షానవాజ్ ఖాసీం, డైరెక్టర్ తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం విభాగం సిబ్బందిని అధికారులను షానవాజ్ ఖాసీం అభినందించారు


