19 criminal cases | నేరగాళ్లకు హెచ్చరిక..
19 criminal cases | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు క్రమక్రమంగా దెబ్బతీస్తూ, స్థానిక ప్రజల(local people)ను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు ప్రమాదకర నేర ప్రవర్తన కలిగిన వ్యక్తుల పై జిల్లా పరిపాలన అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కలెక్టరు డాక్టర్ ఏ. సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ చర్యకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలే ఆధారం. నేర బాధితులు, స్థానికులు, చట్టపరంగా నడుచుకునే పౌరుల దృష్టిలో ఇదో ధైర్యాన్నిచ్చే భారీ నిర్ణయం.
రౌడీషీటర్, కిరాయి హంతకుడు: వరుస కేసుల చరిత్ర..

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్(police station) పరిధిలో షరీన్ నగర్‌కు చెందిన వడ్డే రామాంజనేయులు అలియాస్ వడ్డే అంజి జిల్లా నేర చరిత్రలో అత్యంత ప్రమాదకర రౌడీషీటర్ నెంబర్–1. ఇతని పై హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, ఎస్సీ–ఎస్టీ వర్గాల పై దాడులు, జులుం కేసులు.. ఇలా మొత్తం 17కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. పలుమార్లు రిమాండ్‌కు వెళ్లినా, జైలు శిక్షలు అనుభవించినా, అతని నేర స్వభావంలో కొంచెమైనా మార్పు లేదు.
పఠాన్ ఇమ్రాన్ ఖాన్.. ఇంకా తీవ్రమైన నేర చరిత్ర..
ఇతని వెంటనే నిలిచే మరో వ్యక్తి సస్పెక్ట్ షీటర్ 216 – పఠాన్ ఇమ్రాన్ ఖాన్. ఇతని ఖాతాలో 19 క్రిమినల్ కేసులు(19 criminal cases), అందులో పలుచోట్ల హింస, దాడులు, బెదిరింపులు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనలు ఉన్నాయి. 2022లో వీరిద్దరూ PID యాక్ట్ కింద కడప సెంట్రల్ జైలుకు తరలించినా స్వభావంలో మార్పు రాకపోవడమే కాకుండా జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే దారిలో నడుస్తున్నాడు. ఇది అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది.
నేర ప్రవర్తనపై ‘సున్నితంగా’ కాదు..
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించినట్లుగా, ఈ ఇద్దరి క్రిమినల్ రికార్డులు, నేరాలు, తాజా సమాచారాలు, భవిష్యత్తులో కలిగే ప్రమాదం వంటి అంశాలు క్రమబద్ధంగా పరిశీలించిన వెంటనే కలెక్టరు డాక్టర్ ఏ. సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం కేవలం శాసనాధికార చర్య కాదు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో తీసుకున్న సంస్థాగత ధైర్యం. “ఎవరైనా రౌడీయిజం చేస్తే… నేరస్థానమే జైలు!” ఎస్పీ ఘాటుగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) స్పష్టంగా హెచ్చరించారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద జైలు, జిల్లా బహిష్కరణ కూడా అమలు, ప్రజలను భయపెట్టే, బెదిరించే, శాంతిని భంగం చేసే ఏ వ్యక్తినైనా విడిచిపెట్టేది లేదు.ఇంకా కొంతమంది నేరాలను అలవాటు చేసుకున్న వ్యక్తుల పై కూడా బహిష్కరణ చర్యలు పరిశీలనలో ఉన్నాయని ఎస్పీ స్పష్టం చేశారు.
జిల్లా పరిపాలన–పోలీసుల కఠిన దృక్పథంతో ‘ నేరం చేస్తే క్షమించడం లేదు’ అనే సందేశం ఇచ్చారు. కర్నూలులో ఇటీవల నెలకొన్న రౌడీయిజం, కిరాయి హంతకుల ప్రభావం, గ్యాంగ్‌లు(gangs) పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం చాలా కీలకం. ఈ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి.

