17th Ward | ప్రజా క్షేమం కోసమే పోటీలో ఉన్న…

17th Ward | ప్రజా క్షేమం కోసమే పోటీలో ఉన్న…
17th Ward | కల్లూరు, ఆంధ్రప్రభ : ప్రజల క్షేమం కోసమే పోటీలో ఉన్నానని ఆదరించి ఆదరించి గెలిపించాలని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని 17వ వార్డు అభ్యర్థి కనపర్తి శ్యామల రాజకుమార్ అన్నారు. మంగళవారం ఆంధ్రప్రభ తో మాట్లాడారు . 17వ వార్డులో త్రాగునీరు డ్రైనేజీలు మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేస్తామని ఆదరించి గెలిపించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జెడ్పిటిసి సీనియర్ నాయకులు లక్కినేని రఘు సహకారంతో అభివృద్ధి చేసే అవకాశాన్ని 17వ వార్డు ఓటర్లు అందరూ దీవించి తమకు కల్పించాలని వారు కోరారు. 17వ వార్డు ని మౌలిక వసతుల కల్పనలో తీర్చిదిద్ది ఈ మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా నిలబెడతామని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో ఓటర్లందరిని కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన కనపర్తి శ్యామల రాజ్ కుమార్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుటకు, తమకు అండగా ఉండి, ప్రోత్సహిస్తున్న నాయకులకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు డాక్టర్ లక్కినేని రఘు, కట్ట అజయ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, నాయకులు బీవి ,మేకల కృష్ణ, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
