17th Division | నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా…

17th Division | నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా…
యువ నాయకులు గద్దె క్రాంతికుమార్
17th Division | పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాశాఖామంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. మంగళవారం అశోక్ నగర్ లోని తూర్పు తెదేపా కార్యాలయంలో రాణిగారితోట 17వ డివిజన్ కు చెందిన బి.టెక్ విద్యార్ధిని ధనికుల మహాలక్ష్మీకి సాంకేతిక విద్యకోసం గద్దె క్రాంతికుమార్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన లాప్ టాప్ ను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ విద్యారంగ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని ఆయన స్పూర్తితో తన వంతుగా పేద విద్యార్థులకు ఫీజులు, లాప్ టాప్ లు అందజేస్తూ సహాయం చేస్తున్నానని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజుల్లో అత్యంత కీలకమైందని, ప్రతి విద్యార్థి టెక్నాలజీకి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదని తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు.
17th Division | ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా
విద్యద్వారానే పేద కుటుంబాలు ఉన్నత కుటుంబాలుగా మారతాయనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన పధకం నుంచి పుస్తకాలు, డ్రస్ ఇతర అన్నింటిలో ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా మంత్రి నారా లోకేష్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మరింత బలపరుస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో కీలకమైన నిర్ణయాలను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఈసందర్భంగా విద్యార్ధిని మహాలక్ష్మీ గద్దె క్రాంతికుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయి రంగమ్మ, వేల్పుల శౌరి, పోలిపల్లి ముని, మూల వెంకటేశ్వరరావు, మొకర రమణ, మొకర లక్ష్మి, అశోక్, మునికృష్ణ, దైదా మహేష్, మందుల వీరాస్వామి, మల్లెల కుమారి, షేక్. అమీనా తదితరులు ఉన్నారు.
