16th Ward | పార్టీలు కాదు ముఖ్యం అభివృద్ధి ధ్యేయం

16th Ward | పార్టీలు కాదు ముఖ్యం అభివృద్ధి ధ్యేయం

16th Ward | కల్లూరు, ఆంధ్రప్రభ : స్వతంత్ర అభ్యర్థిగా 16వ వార్డులో బరిలో ఉన్నానని నాకు పార్టీలు ముఖ్యం కాదు అభివృద్ధి ధ్యేయమని ఉబ్బన రాంబాబు అన్నారు. కల్లూరు మున్సిపాలిటీలో 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఉండి అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నానని ఆదరించి మీ అమూల్యమైన ఓటు ఏసి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని , మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించుకోవాలని , అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు . గతంలో స్థానికంగా ప్రజలతో మేమేకమై ప్రజలకు అందించిన నిస్వార్థ సేవలను గుర్తు చేస్తూ ఈ ఎన్నికలలో మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలిపిస్తే మరిన్ని సేవలు అందించుకుంటూ మీ రుణం తీర్చుకుంటానని పత్రిక ముఖంగా ఆయన వాటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యువ నాయకులు ధర్నాసి.ప్రసాదు, l ధర్నాసి. జయంతి రాజు, ఉబ్బని ఇస్సాకు, ఉబ్బన ముత్తయ్య, ఉబ్బన వెంకయ్య, మహిళా మణులు, రాంబాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply