16 Maoists | షెల్ట‌ర్ కోసం వ‌చ్చి… పోలీసుల‌కు చిక్కిన మావోయిస్టులు

16 Maoists | షెల్ట‌ర్ కోసం వ‌చ్చి… పోలీసుల‌కు చిక్కిన మావోయిస్టులు

  • 16 మంది మావోయిస్టుల అరెస్ట్
  • అరెస్ట‌యిన వారిలో ఏడుగురు మ‌హిళ‌

16 Maoists | ఉమ్మడి ఆదిలాబాద్ , ఆంధ్ర‌ప్ర‌భ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో దండకారణ్యానికి చెందిన 16 మంది మావోయిస్టుల(16 Maoists)ను ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాణహిత ఆవతల వైపు కగార్ ఆపరేషన్(peration), పోలీసుల నిర్బంధం పెరిగిన నేపథ్యంలో షెల్టర్ జోన్ నిమిత్తం తెలంగాణ‌లోకి చేరుకున్నారు.

ప్రాణ‌హిత న‌ది దాటి కొమురం భీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో తల దాచుకునేందుకు మావోయిస్టులు వచ్చినట్టు తెలిసింది. స‌మాచారం అందుకున్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో పోలీసులు కూంబింగ్(police combing) ఆపరేషన్ చేపట్టగా సిర్పూర్ – యు మండలం పెద్దదబోలి శివారులో ఉన్న‌ట్టు గుర్తించారు.

వారిని పోలీసులు చుట్టు ముట్టి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడు గురు మహిళాలు ఉన్నట్టు తెలిసింది. వారి వద్ద ఏకే 47 రైఫిల్స్ తో పాటు, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి, 303 ఆయుధాలు లభించినట్టు సమాచారం. అరెస్ట్ అయిన మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం వరకు డిజిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Leave a Reply