15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story
- ఎందుకు అంత కీలకం?
- 15 వేల బలగాల వేట
- మావోయిస్టు పార్టీ అగ్రనేత మిసిర్ బస్రా
- సారండ అడవుల్లో హైటెక్ కూంబింగ్
- డ్రోన్లు, శాటిలైట్ టెక్నాలజీ వినియోగం
- ఎందుకు దొరకడం లేదు?
- సాగర్ .జీ వ్యూహం ఏమిటి?
- మావోయిస్టుల రహస్య నెట్‌వర్క్
- అతడే ఎందుకు టాప్ టార్గెట్?
- తృటిలో మాయం
- 2009 ఎస్కేప్ ఘటన: కీలక మలుపు
- వృద్ధాప్యంలోనూ మోస్ట్ వాంటెడ్
- మిసిర్ బస్రా పట్టుబడితే ఏమవుతుంది?
- ఆపరేషన్ కగార్ విజయం
- లేదో వైఫల్యం?
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

తెలుంగాణ సాయుధ రైతాంగ పోరాటం…. శ్రీకాకుళం సాయుధ రైతాంగం పోరాటం.. డార్జిలింగ్ నక్సల్పబరి రైతాంగం పోరాటం.. స్ఫూర్తితో.. తెలుగునేలలో వేళ్లూనిన నక్సలిజం..మహారాష్ట్ర, చత్తీస్ గడ్, తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నడుమ దండకారణ్యంలో.. అడవి బిడ్డల్ని ఉద్యమ బాటలో నడిపిన నక్సలిజం.. అదే నేటి మావోయిస్టు పార్టీ.. పాతికేళ్లు దండకారణ్యంలో జనతన సర్కారు పేరిట రాజ్యమేలింది. అంతే కాదు.. 10 రాష్ట్రాల్లో 126 జిల్లాలకు విస్తరించింది. ఈ స్థితిలో.. నక్సలిజ అంతమే లక్ష్యంగా రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను తెరమీదకు తీసుకు వచ్చింది. ₹ 6,800 కోట్లు ఖర్చు చేసింది. లక్షకు పైగా కేంద్ర పాయుధ బలగాలను రంగంలోకి దించింది.

2026 మార్చి 31 డెడ్ లైన్ తో కగార్ ఆపరేషన్ ముందుకు నడిపింది. మావోయిస్టు పార్టీ సుప్రీం నంభాల కేశవరావు సహా 300 పైగా మావోయిస్టులను లేపేసింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాలరావు,ఆశన్న, తిప్పరి తిరుపతి సహా 950 మందిని లొంగదీసింది. కగార్ ఆపరేషన్ ముగింపు కేవలం కొన్ని గంటల్లో ఉండగా.. ఒకే ఒక్కడి సంగతి తేల్చటానికి నానా తంటాలు పడుతోంది. ఇంతకీ అతడెవరో తెలుసాఝ ఇంకెవరు అతడే ఒకే ఓక్కడు కురువృద్ధుడు గణపతి అని అందరూ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే.. మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి బతికి ఉన్నాడో.. లేడో తెలీదు.. కానీ మరో నాయకుడు ఉన్నాడు. అతడూ ప్రస్తుతం వృద్ధాప్యంలోనూ యాక్తివ్ గా.. కేంద్ర బలగాలకు దొరకటం లేదు.
15K Hunting Foeces : అతడే.. మిసిర్ బాస్ర

ఔను.. మిసిర్ బెస్రా అలియాస్ సునీల్, సాగర్ జీ, భాస్కర్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన ఏకైక చురుకైన జార్ఖండ్ సభ్యుడు. అతని తల కోసం ప్రభుత్వం రూ. 1 కోటి బహుమతిని ప్రకటించింది. ఆ ఒక్కడిని పట్టుకుంటే.. భారత దేశంలో నక్సలిజం అంతరించినట్టేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అతడిని బంధించటం లేదా.. హతమార్చటానికి 15,000 మంది సాయుధ దళాలను రంగంలోకి దించింది. అత్యాధునిక డ్రోన్ల నిఘాలో అతడిని గాలిస్తోంది. సుమారు 15,000 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF), కోబ్రా (CoBRA), జార్ఖండ్ జాగ్వార్ . చైబాసా జిల్లా పోలీసు బలగాలు తుది ఆపరేషన్ లో పాల్గాన్నాయి.
15K Hunting Foeces : హైటెక్నాలజీ కూంబింగ్..

సారండ అడవుల్లో భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ (Kagar) , ఆపరేషన్ మేఘబూరు పేరిట జరుపుతున్న కీలక దాడుల్లో అత్యంత అధునాతన సాంకేతికతను భద్రత దళాలు ఉపయోగిస్తున్నాయి. ఎంత పకడ్బంధీగా జల్లెడ పట్టినా.. మిసిర్ బాస్రా మిస్ అవుతూనే ఉన్నాడు. ఆసియాలో దట్టమైన ఈ డార్క్ పారెస్టులో మావోయిస్టుల కదలికలను గుర్తించటానికి ఇజ్రాయెల్ తయారీ హెరాన్ (Heron), హరోప్ (Harop) అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను భద్రత దళాలు ఉపయోగిస్తున్నాయి.

డ్రోన్ సెన్సార్ల ద్వారా అడవిలోని దుర్భేద్య ప్రాంతాల హై-డెఫినిషన్, రియల్-టైమ్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక మావోయిస్టులు అమర్చిన వేలాది ప్రెషర్ బాంబులు , ఐఈడీలను గుర్తించడానికి సీఆర్‌పీఎఫ్ , NSG ‘బ్లాక్ క్యాట్స్’ రంగంలోకి దిగాయి. అడవి మార్గాల్లో భూమి అడుగున పాతిపెట్టిన మందుపాతరలను గుర్తించడానికి అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్లను ఉపయోగిస్తున్నారు.

జీపీఎస్: సిగ్నల్స్ లేని దట్టమైన అడవుల్లో శాటిలైట్ ఫోన్లు టాక్టికల్ రేడియోలను వాడుతున్నారు. శాటిలైట్ గైడెన్స్ ఆధారిత డిజిటల్ మ్యాపింగ్ పరికరాలతో అడవిలోని ప్రతి అంగుళాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి, CoBRA బలగాల కోసం ఇజ్రాయెలీ X95 రైఫిళ్లను కేటాయించారు. ఇవి 5.56mm నుంచి 9mm వరకు తూటాలను మార్చుకోగల సామర్థ్యంతో నిశ్శబ్దంగా కాల్పులు జరపడానికి సైలెన్సర్లను కలిగి ఉంటాయి. ఆయుధాలకు అమర్చిన లేజర్ రేంజ్ ఫైండర్లు, రెడ్ డాట్ సైట్స్ తో చీకటిలో లేదా దట్టమైన పొదల్లో ఉన్న టార్గెట్ లను ఖచ్చితంగా కొట్టవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే బలగాలు మావోయిస్టుల అడ్డా అయిన బంకర్లను ఛేదిస్తూ ముందుకు సాగుతున్నాయి.
15K Hunting Foeces : అయినా దొరకట్లే

మిసిర్ బెస్రా తన 50 మంది సభ్యుల బృందంతో కలిసి సారండ అడవుల్లోనే తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బలగాలు అతని స్థావరాన్ని చుట్టుముట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఫలితం దక్కటం లేదు. ఎంకంటే.. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద సాల్ (Sal) వృక్షాల అడవిలో మిసిర్ బాస్ర జాడ దొరకటం లేదు. సుమారు 700 కొండలతో ఈ ప్రాంతం ప్రకృతి పరంగా ఎంతో అందమైనది. దట్టమైన చెట్లు, దుర్భేద్య కొండలు ఉండటంతో దశాబ్దాలుగా ఇది మావోయిస్టులకు సురక్షిత ‘లిబరేటెడ్ జోన్’ (విముక్తి ప్రాంతం) గా మారింది. ఈ అడవిలో సూర్యరశ్మి కూడా నేలను తాకని స్థితి. ఇక్కడే ఈస్టర్న్ రీజినల్ బ్యూరో ప్రధాన కార్యాలయంగా ఉంది.
15K Hunting Foeces : టెక్నాలజీకి చిక్కడు దొరకడు

మిసిర్ బెస్రా ప్రస్తుతం జార్ఖండ్, ఒడిశా సరిహద్దుల్లోని సారండ అడవుల్లో అత్యంత రహస్యంగా తలదాచుకున్నట్లు నిఘా వర్గాల తాజా సమాచారం. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, ఒడిశాలోని సుందర్‌గఢ్, కియోంజర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం అతనికి సురక్షిత ప్రాంతంగా మారింది.

దట్టమైన అడవులు, కొండల కారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా మారుతూ తప్పించుకుంటున్నాడు. అతని చుట్టూ దాదాపు 30 నుంచి 50 మంది సుశిక్షితులైన గెరిల్లా బలగాలతో కూడిన ‘ప్రొటెక్షన్ టీమ్’ నిరంతరం పహారా కాస్తుంది. ఈ పహారా కూడా మూడంచెల పద్ధతిలో ఉంటుంది. అతను ఎలక్ట్రానిక్ పరికరాలను వాడడు, కేవలం కొరియర్లతో మాత్రమే సమాచారాన్ని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతన్ని పట్టుకోవడం భద్రతా దళాలకు సవాలుగా మారింది.ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో సీఆర్‌పీఎఫ్ కి చెందిన ఎలైట్ ఫోర్స్ కోబ్రా 209 మరియు 203 బెటాలియన్లు ప్రస్తుతం అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సరిహద్దు ప్రాంతాల్లోని సుమారు 20 గ్రామాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి, అడవిలోకి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు.
15K Hunting Foeces : ఇతడే ఎందుకు టార్గెట్

మిసిర్ బస్రా (అలియాస్ సునీల్, సాగర్ జీ నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో అత్యంత కీలక అగ్రనేత. ఈస్టర్న్ రీజినల్ బ్యూరో (ERB) సుప్రీం కమాండర్: 2023 ఫిబ్రవరిలో ప్రశాంత్ బోస్ అరెస్ట్ తర్వాత, మిసిర్ బస్రాను ఈస్టర్న్ రీజినల్ బ్యూరోకు సుప్రీం కమాండర్‌గా నియమించారు. ఈ బ్యూరో పరిధిలోకి జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తూర్పు భారత్ వస్తాయి.

మావోయిస్టు పార్టీలో పొలిట్‌బ్యూరో అత్యున్నత నిర్ణయాధికార విభాగం. ప్రస్తుతం పార్టీలో అతికొద్ది మంది పొలిట్‌బ్యూరో సభ్యులలో మిసిర్ బస్రా ఒకడు. జాతీయ స్థాయి విధాన రూపకల్పనలో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) సాయుధ విభాగానికి వ్యూహరచనలో కీలక బాధ్యత వహిస్తాడు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, 2026 నుంచి అతను PLGA కీలక నాయకత్వ బాధ్యతల్లో ఉన్నాడు. జార్ఖండ్‌లోని సారండ అడవులను కేంద్రంగా చేసుకుని పార్టీ కార్యకలాపాలను, దళాలను నడిపించడం మిసిర్ బాస్ర ప్రధాన బాధ్యత. పైగా అతడి తలపై రూ. 1 కోటి రివార్డు ఉంది. జార్ఖండ్‌లో మిగిలిన ఏకైక కీలక అగ్రనేత ఈయనే, పైగా తూర్పు భారతంలో కీలక నేత కావటంతో.. మిసిర్ బాస్రాను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది.
15K Hunting Foeces : తృటిలో మాయం

ఏప్రిల్ 2025లో ఒకే ఒక ప్రధాన ఆపరేషన్ లో మిసిర్ బెస్రా అతని బృందం ఉపయోగించే 11 భూగర్భ బంకర్లను పోలీసులు పేల్చివేశారు. వీటిలో 25×35 అడుగుల వైశాల్యం కలిగిన భారీ బంకర్లు కూడా ఉన్నాయి. ఈ బంకర్లలో ఒక్కొక్కటి 40 నుండి 50 మంది మావోయిస్టులు తలదాచుకునేంత పెద్దవిగా ఉన్నాయి. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని సారండ అడవుల్లో ముఖ్యంగా టోంటో , జరైకెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్పబురు అటవీ ప్రాంతంలోని మావోయిస్టు బంకర్లపై 2025, ఏప్రిల్ 15, మంగళవారం సుమారు 4,000 మంది భద్రతా సిబ్బంది దాడి చేశారు. CRPF 6 బెటాలియన్లు. CoBRA 2 బెటాలియన్లు , జార్ఖండ్ జాగ్వార్ (రాష్ట్ర ప్రత్యేక విభాగం). చైబాసా జిల్లా పోలీసులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ బంకర్లను కేవలం తలదాచుకోవటానికి కాకుండా, భారీ స్థాయిలో వనరులను నిల్వ చేయడానికి కూడా ఉపయోగించేవారు. బలగాల సోదాల్లో అక్కడ 7 శక్తివంత ఐఈడీ (IED) బాంబులు, ప్రింటర్లు, లేత్ మెషీన్లు (Lathe machines), వైర్‌లెస్ సెట్లు, భారీగా ఆహార ధాన్యాలు (సుమారు 12,000 కేజీలు) మందుగుండు సామగ్రి లభించాయి.
15K Hunting Foeces : దొరికినట్టే దొరికి ..
పోలీసులకు దొరికినట్టే దొరికి.. ఆ తరువాత కోర్టు విచారణ సమయంలో మిసిర్ బాస్రా అదృశ్యమయ్యాడు. కాదు.. మావోయిస్టులే పోలీసులపై దాడి చేసి తీసుకువెళ్లారు. సరీగా 16 ఏళ్ల కిందట ఈ ఘటన జరిగింది. 2007 సెప్టెంబర్ జార్ఖండ్‌లోని రాయ్‌గంజ్ ప్రాంతంలో మిసిర్ బెస్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.2009లో ఇతనిని కోర్టు విచారణ కోసం తీసుకెళ్తుండగా, లఖిసరాయ్ (బీహార్) వద్ద మావోయిస్టు దళాలు పోలీసులపై దాడి చేసి బాస్రాపు విడిపించుకుపోయాయి. అప్పటి నుంచి మిసిర్ .. పోలీసులకు మిస్ అవుతూనే ఉన్నాడు.
15K Hunting Foeces : అవసాన దశలోనూ.. అతడే మోస్ట్ వాంటెడ్

ప్రస్తుతం మిసిర్ బెస్రా వయస్సు 60 ఏళ్లు దాటింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. తన ‘ప్రొటెక్షన్ స్క్వాడ్’ సాయంతో సారండ అడవుల్లోని అత్యంత రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడు. ఇతనిని పట్టుకుంటే జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యవస్థ దాదాపు కుప్పకూలినట్లేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. కానీ గత ఏడాది ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కారద్యర్శి నంభాల కేశవరావు గుట్టును కోవర్టులే రట్టు చేశారని,, అందువల్లే ఆయన దొరికాడని, మావోయిస్టు పార్టీ గ్రహించినట్టు సమాచారం. కనీసం మిసిర్ బాస్రాను కాపాడుకుని ఆపరేషన్ కగార్ కు పూర్తి విజయం దక్కనీయరాదనే మిసిర్ బాస్రాను కంటికి రెప్పలా గెరిల్లా దళాలు కాపాడుతున్నట్టు తెలుస్తోంది. ఎనీ హౌ.. ఒక వృద్ధ మావోయిస్టు కోసం.. కేంద్ర ప్రభుత్వం ఇంతగా పంతానికి పోవటానికి… అసలు కారణం.. అతడు బతికి ఉంటే.. ఆపరేఫన్ కగార్ విఫలమైనట్టే. ఇదీ సంగతి.
