వందేమాతరం గేయానికి 150ఏళ్లు..

వందేమాతరం గేయానికి 150ఏళ్లు..

కమ్మర్ పల్లి, నవంబర్ 7 ( ఆంధ్ర ప్రభ ) : వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లు ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్ (Chinta Raja Srinivas) పేర్కొన్నారు.

శుక్రవారం కమ్మర్ పల్లి (Kammarpally) మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యాలయ సిబ్బందితో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు తెలిపారు. వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ విద్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply