హన్మకొండ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా 12మంది మిలీషియన్ సభ్యులు. వీరిలో 13 మంది ఛత్తీస్‌గఢ్, ఒకరు తెలంగాణకు చెందినవారు ఉన్నారు. లొంగిపోయిన వారికి రూ.25వేల చొప్పున రివార్డు అందజేశారు. అలాగే కర్రెగుట్ట ఆపరేషన్‌కు తెలంగాణ పోలీసుల ప్రమేయం లేదని ఐజీ తెలిపారు.
కాగా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్‌లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ పోరు తుది దశకు చేరుకునే పరిస్థితులు నెలకొన్నాయి.. సెర్చింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ మావోయిస్టు పార్టీ నేతలు రాసిన లేఖను కేంద్రం కొట్టిపడేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం మావోయిస్టులు, భద్రత దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం.