13వ వార్డులో సింహం జోరు

13వ వార్డులో సింహం జోరు
ప్రచారంలో తిరుమల్ ముందంజ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పట్టణంలోని పదవమూడవ వార్డులో సింహం దూసుకుపోతుంది. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సల్వాజి తిరుమల్ ప్రచారంలో అధికార విపక్ష పార్టీల అభ్యర్థులకు దీటుగా ముందుకెళ్తున్నారు. వార్డు పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్ లో సింహం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… వార్డు ప్రజలు తనకు మద్దతి ఇచ్చి కౌన్సిలర్గా అవకాశం ఇస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానన్నారు. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగవద్దని, సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఆదరించి అవకాశం ఇస్తే అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ప్రచారంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి దూసుకుపోతుండడంతో 13వ వార్డులో సింహం గెలవడం పక్కా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
