Basara |13వ రోజు ఆర్జీయూకేటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన

ప్రధాన ద్వారం ఎదురుగా ఎండలో గొడుగులు పట్టుకొని నిరసన


బాసర, ఏప్రిల్ 21( ఆంధ్రప్రభ) : ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన సోమవారంతో 13వ రోజుకు చేరుకుంది. ఆర్జీయూకేటి ప్రధాన ద్వారం వద్ద ఎండలో గొడుగులు పట్టుకొని నిరసన చేపట్టారు. గత 13 రోజులుగా యూనివర్సిటీలో విద్యార్థులకు తరగతులు నిర్వహించకుండా, అదనపు బాధ్యతలు చేపట్టకుండా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉపేంద్ర్, కృష్ణ ప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రాగుల, డాక్టర్ విటల్, ప్రకాష్, డాక్టర్ రోషన్, డా.సాయికృష్ణ, డా.పావని, డా.శ్వేత, డా.స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply