13 years | శివస్వాములకు పద్మశాలి మహిళల సేవ

13 years | శివస్వాములకు పద్మశాలి మహిళల సేవ
13 years | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయ ఆవరణలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములకు పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా అన్నదానం, ఫలదానం కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి మహిళలు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శివస్వాములకు భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలు దాసపత్రి శకుంతల మాట్లాడుతూ… గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా శివస్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా భక్తుల ఆశీస్సులు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్, వనం గీత, గుర్రం హైమావతి, చిలువేరు ధనరాజ్, దాసు శ్రీనివాసులు, పులిజాల కళ్యాణి, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, వర్కాల బాలకిష్టమ్మ, దాసు జంగమ్మ, క్యామ తిరుపతమ్మ, కుకుడాల నారాయణమ్మ, వనం శ్రీదేవి, కర్నాటి బాలమణి, ఎల్లికంటి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
