చేతి గుర్తుకు ఓటు 12వ వార్డు అభివృద్ధికి మలుపు

చేతి గుర్తుకు ఓటు 12వ వార్డు అభివృద్ధికి మలుపు
12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్
రైటప్: తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్న12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్
మక్తల్ , ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటుతో 12వ వార్డు అభివృద్ధికి మలుపు కానుందని 12వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రహీం పటేల్ అన్నారు. శనివారం రోజు ఆయన తన మద్దతు దారులతో కలిసి 10 వ వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనను ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు .అధికార కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు .10వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని అన్నారు. ఈ ప్రాంతం వాడిగా మీ అందరి సహకారం తనకు కావాలని అభ్యర్థించారు .ఎల్లవేళలాశమీ మధ్య ఉంటున్న వ్యక్తిగా మీ అందరి బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. 12వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను మునిసిపల్ కౌన్సిలర్‌గా గెలిపించాలని రహీం పటేల్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
