1279 votes | బిక్కనూర్ సర్పంచిగా రేఖ విజయం…
1279 votes | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు పట్టణ సర్పంచిగా బల్యాల రేఖ విజయం సాధించారు. ఈ రోజు తెల్లవారుజాము వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆమె సర్పంచ్ బరిలో నిలిచారు. 1279 ఓట్ల(1279 votes) మెజారిటీతో ఆమె సర్పంచిగా విజయం సాధించారు.
ఈ మేరకు ఆమెకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి(Returning Officer) సర్పంచిగా ధ్రువపత్రం అందజేశారు. అనంతరం 16 మంది వార్డు సభ్యుల సమక్షంలో ఉపసర్పంచ్ ను ఎన్నుకున్నారు. రెండవ వార్డు నుండి గెలుపొందిన దుంపల మోహన్ రెడ్డి ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు.

