అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య

ఆంధ్రప్రభ, మక్తల్ , : మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభివృద్ధి కోసం తనకు ఆదరించి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తానని బిజెపి అభ్యర్థి జరశ్రీ చిన్న కొండయ్య అన్నారు. బుధవారం వార్డు పరిధిలోని ఆజాద్ నగర్, రెడ్డి నగర్, వినాయక్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎలాంటి నిధులు ఇవ్వద్దని గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలమూరు ఎంపీ డీకే అరుణ మద్దతుతో మక్తల్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడం బిజెపికే సాధ్యమని అన్నారు. 11వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు .మిషన్ భగీరథ పైప్లైన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని అన్నారు. అదేవిధంగా వార్డులో నెలకొన్న వివిధ సమస్యలు ,పారిశుద్వానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఒకసారి గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 11వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చెన్నారెడ్డి ,నరసింహారెడ్డి ,రాజు, బి. కురుమయ్య, గుడిసె మహేష్, దండు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply