మీ బిడ్డగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి

మీ బిడ్డగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి

11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి యేనగందుల అనూష కృష్ణ

జనగామ, ఆంధ్రప్రభ : 11వ వార్డులో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ బిడ్డగా ఎన్నికల్లో నిలిచానని ఆశీర్వదించి గెలిపించాలని 11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి యేనగందుల అనూష కృష్ణ అన్నారు. ఆదివారం 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలతో మమేకమై పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సమస్యల పరిష్కారంతోపాటు స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వార్డులో ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, రోడ్లు మరమ్మతు చేయడం, వార్డులో అనేక కుటుంబాల్లో పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అవసరాలు ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, జనగామలో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అధికారంలో ఉన్నారని జనగామ మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని నిధులతో వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపడతామని వారు వివరించారు. ప్రచార కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, వార్డు నాయకులు,చేనేత కార్మికులు, చేనేత కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply