110 students | పాఠ‌శాల‌కు తాళం!

110 students | పాఠ‌శాల‌కు తాళం!

  • ఇది ప్ర‌జ‌ల తిరుగుబాటు

110 students | అచ్చంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : ఉపాధ్యాయుల కొర‌త‌పై విద్యార్థుల త‌ల్లిదండ్రులు తిరుగుబాటు చేశారు. ఈ రోజు నాగర్‌కర్నూల్‌ జిల్లా(Nagarkurnool District) పదర మండలం ఇప్పలపల్లి గ్రామంలో పాఠ‌శాల‌కు తాళం వేసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు మాట్లాడుతూ.. 110 మంది విద్యార్థులున్న(110 students) పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులు లేరని, ఉన్న‌ ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర పాఠశాలలకు పంపడంతో విద్యార్థులకు బోధించేవారు లేరంటూ, విద్యార్థుల భ‌విష్య‌త్తు నాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇప్పలపల్లి, గానుగుపెంట పంచాయ‌తీల‌కు కలిపి ఇప్పలపల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల(Mandal Parishad Primary School)లో వంద‌ మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయులుండగా ఉపాధ్యాయుల సర్దుబాటు తదితర కారణాలతో ఇతర పాఠశాలలకు పంపించార‌ని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులకు అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల గేట్‌కు తాళం వేసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాచేపట్టారు.

Leave a Reply