ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్ : అంధ్రప్రదేశ్ (AndhraPradesh) ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో పలువురు ఐఎఫ్‌ఎస్ (IFS) అధికారులను బదిలీ (Transfers) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు జరిగాయి.

పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ( Environmental Development Corporation MD) గా రాజేంద్రప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్‌.ఎస్‌. శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్‌.శ్రీ శర్వాణన్ నియమితులయ్యారు. అలాగే, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్‌గా ఎస్‌.శ్రీకాంతనాథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా బి. విజయ్‌కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్‌గా బి.వి.ఎ.కృష్ణమూర్తి నియమించబడ్డారు.

Leave a Reply